Royal Enfield: తుపాను బాధిత కస్టమర్ల కోసం రాయల్ ఎన్ ఫీల్డ్ కీలక నిర్ణయం

  • ఏపీ, తమిళనాడు రాష్ట్రాలపై మిగ్జామ్ తుపాను ప్రభావం
  • తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని కస్టమర్లకు రాయల్ ఎన్ ఫీల్డ్ వెసులుబాటు
  • ఉచితంగా టోయింగ్, ఫుల్ వెహికిల్ చెకప్
Royal Enfield decides to help cyclone hit customers

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ మిగ్జామ్ తుపాను నేపథ్యంలో తన కస్టమర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావానికి గురైన తమ కస్టమర్లకు కొద్దిమేర వెసులుబాటు కల్పించాలని రాయల్ ఎన్ ఫీల్డ్ భావిస్తోంది. 

ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో తుపాను అత్యధిక ప్రభావం చూపిన నేపథ్యంలో... ఈ రెండు రాష్ట్రాల్లోని తమ కస్టమర్లలో తుపాను ప్రభావానికి గురైన వారికి కొన్ని బైక్ సర్వీసింగ్ సేవలు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. 

ఈ రెండు రాష్ట్రాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన కస్టమర్లు తమ వివరాలను డిసెంబరు 20 లోపు నమోదు చేసుకోవాలని రాయల్ ఎన్ ఫీల్డ్ సూచించింది. అందుకోసం 1800 2100 007 టోల్ ఫ్రీ నెంబరును కూడా తీసుకువచ్చింది. ఈ నెంబరు డిసెంబరు 8 నుంచి అందుబాటులో ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. వివరాలు నమోదు చేసుకున్న వారికి రాయల్ ఎన్ ఫీల్డ్ షోరూంలలో ఉచితంగా టోయింగ్, ఫుల్ వెహికిల్ చెకప్ నిర్వహిస్తారు.

More Telugu News