YS Jagan: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ఏపీ సీఎం వైఎస్ జగన్

YS Jagan calls KTR over KCR health
  • కేటీఆర్‌కు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన జగన్
  • కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
  • యశోద ఆసుపత్రిలో ఆపరేషన్ చేసిన వైద్యులు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిన్న అర్ధరాత్రి కేసీఆర్ బాత్ రూంలో కాలు జారి కిందపడటంతో తుంటి ఎముక విరిగింది. ఈ నేపథ్యంలో జగన్ శుక్రవారం కేటీఆర్‌కు ఫోన్ చేశారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు. కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. కేసీఆర్‌ను పరిశీలించిన వైద్యులు ఎడమ కాలి తుంటి ఎముక విరిగిందని తెలిపారు. ఆయనకు సాయంత్రం శస్త్ర చికిత్స చేస్తున్నారు. ఆయన కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని తెలిపారు.
YS Jagan
KTR
KCR

More Telugu News