Chandrababu: కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: చంద్రబాబు, నారా లోకేశ్

Chandrababu and Nara Lokesh wishes speedy recovery of KCR
  • ఫామ్ హౌస్ లో జారి పడ్డ కేసీఆర్
  • యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం
  • కేసీఆర్ గాయపడ్డారనే వార్తతో ఆందోళనకు గురయ్యానన్న చంద్రబాబు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన యశోద ఆసుపత్రిలో ఉన్నారు. మరోవైపు ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ గాయపడటంపై టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్ గాయపడ్డారనే వార్త విని ఆందోళనకు గురయ్యానని చంద్రబాబు తెలిపారు. త్వరగా, సంపూర్ణంగా ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. గాయం నుంచి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. 

Chandrababu
Nara Lokesh
Telugudesam
KCR
BRS

More Telugu News