Revanth Reddy: కేసీఆర్ కు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించాను: రేవంత్ రెడ్డి

I ordered to ensure that KCR gets better medical services says Revanth Reddy
  • కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశానన్న రేవంత్ 
  • ఆసుపత్రికి వెళ్లాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించానని వెల్లడి
  • కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగిందని చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

కేసీఆర్ కు కుడి తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో జారి పడటంతో ఆయన గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనకు సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. కేసీఆర్ తుంటి ఎముకకు డాక్టర్లు స్టీల్ ప్లేట్లను అమర్చనున్నారు.
Revanth Reddy
Congress
KCR
BRS

More Telugu News