Chinna Jeeyar Swamy: సంక్షేమ పథకాలతో ప్రజలను బద్ధకస్తులుగా, బలహీనులుగా మారుస్తున్నారు: చిన్నజీయర్ స్వామి

  • ఉచిత పథకాలు, రాయితీలపై చిన్నజీయర్ స్వామి విమర్శలు
  • కూర్చుంటే ఒకటి, పడుకుంటే మరొకటి.. ఇలా అన్నింటికీ రాయితీలు ఇస్తున్నారని వ్యాఖ్య
  • పని చేయడం ఎందుకనే ధోరణిలో ప్రజలు ఉన్నారని విమర్శ
Chinna Jeeyar Swamy criticises free schemes

సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వాలు పలు ఉచితాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉచితాలపై చినజీయర్ స్వామి స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను బద్ధకస్తులుగా మారుస్తున్నారని అన్నారు. ప్రజలకు ప్రభుత్వాలు పలు రాయితీలను ఇస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. కూర్చుంటే ఒకటి, నడిస్తే ఒకటి, పుడితే ఒకటి, నడిస్తే ఒకటి, తింటే ఒకటి, తినకపోతే ఒకటి, పడుకుంటే మరొకటి ఇలా ప్రతి దానికి రాయితీలు, ఉచితాలు ఇస్తూ ప్రజలను బలహీనులుగా, బద్ధకస్తులుగా చేస్తున్నారని అన్నారు. అన్నీ మనింటికే చేరుతుంటే ఇక పని చేయడం ఎందుకులే అనే ధోరణిలో ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా బావులపాడు మండలం వీరపల్లిలో విజయా డెయిరీ కొత్త యూనిట్ ను చిన్న జీయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News