revanth reddy: విద్యుత్ పరిస్థితి గందరగోళంగా ఉంది.. సీఎండీపై చర్యలు తీసుకోవచ్చా?: అధికారులతో రేవంత్ రెడ్డి

Revanth Reddy hot comments on CMD

  • విద్యుత్ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశం
  • శుక్రవారం జరగనున్న సమీక్షకు సీఎండీని పిలవాలని సూచన
  • అధికారులు సమర్థవంతంగా పని చేయకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని హెచ్చరిక

రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి గందరగోళంగా ఉందని... విద్యుత్ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేబినెట్ సమావేశంలో విద్యుత్ పరిస్థితిపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సీఎండీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అని రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం జరగనున్న సమీక్షకు సీఎండీని కూడా పిలవాలని ఆదేశించారు. సీఎండీ రాజీనామాను ఆమోదించవద్దన్నారు. ఆరు గ్యారెంటీలపై కర్ణాటకకు వెళ్లి అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజల ఆకాంక్షల మేరకు అధికారుల పని తీరు ఉండాలని సూచించారు. అధికారులు సమర్థవంతంగా పని చేయకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News