Revanth Reddy: సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సంతోషాన్ని కలిగించింది: నందమూరి రామకృష్ణ

Nandamuri Ramakrishna on Revanth Reddy take oath as CM
  • తెలంగాణలో కొలువుదీరిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
  • రేవంత్ రెడ్డికి, మంత్రులకు నందమూరి రామకృష్ణ అభినందనలు
  • రాష్ట్రాభివృద్ధిని విజయవంతంగా కొనసాగిస్తారని ఆశాభావం
రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి శాఖలు కూడా కేటాయించారు. మొత్తం కేబినెట్లో ముఖ్యమంత్రి సహా 18 మందికి అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎం సహా 12 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఆరుగురికి కేబినెట్లో అవకాశముంది.

 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై నందమూరి రామకృష్ణ స్పందించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి రామకృష్ణ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. రాష్ట్రాభివృద్ధిని విజయవంతంగా కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Revanth Reddy
Telangana Assembly Results
Congress

More Telugu News