Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్‌కు ఆర్టీసీ అధికారుల నోటీసులు

  • రూ.8 కోట్లు బకాయిలు చెల్లించలేదని నోటీసులు
  • ఏ క్షణమైనా సీజ్ చేస్తామని మాల్ ఎదుట ప్రకటన
  • విద్యుత్ సరఫరా కూడా నిలిపివేత
RTC notices to Jeevan Reddy

టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని జీవన్ రెడ్డికి చెందిన మాల్‌కు సంబంధించి నోటీసులు జారీ చేశారు. రూ.8 కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా ఏ క్షణమైనా సీజ్ చేస్తామని ఈ మాల్ ఎదుట మైక్‌లో ప్రకటించారు. దీంతో షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న వ్యాపారస్తులకు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మాల్‌ను స్వాధీనం చేసుకోవడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ మాల్‌కు విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. విద్యుత్ శాఖకు రూ.2 కోట్ల బకాయి ఉండటంతో గతంలోనే నోటీసులు ఇచ్చారు. బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవడంతో విద్యుత్ నిలిపివేసినట్లు వెల్లడించారు.

More Telugu News