YS Jagan: తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు: ఏపీ సీఎం జగన్

AP CM Jagan congratulates Telangana newly sworn CM Revanth Reddy
  • ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు
  • విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ
  • నేడు సీఎంగా పదవీప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి
  • తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం పరిఢవిల్లాలంటూ సీఎం జగన్ స్పందన
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ఇవాళ పదవీప్రమాణ స్వీకారం చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ రెండు పర్యాయాలు సీఎంగా వ్యవహరించగా, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనపై అభినందనల వర్షం కురుస్తోంది. 

తాజాగా, ఏపీ సీఎం జగన్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. "తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
YS Jagan
Revanth Reddy
Chief Minister
Telangana
Andhra Pradesh

More Telugu News