Rohit Sharma: అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఆహ్వానం

  • అయోధ్యలో రామ మందిరం నిర్మాణం
  • జనవరి నాటికి పూర్తయ్యే అవకాశం
  • 2024 జనవరి 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్ట
  • వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానాలు
  • దాదాపు 7 వేల మంది అతిథులను ఆహ్వానించనున్న తీర్థ క్షేత్ర ట్రస్టు
Rohit Sharma has been invited for Pran Prathishta in Ayodhya Ram Mandir

అయోధ్యలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రామ మందిరం వచ్చే ఏడాది జనవరి నాటికి సిద్ధం కానున్నట్టు తెలుస్తోంది. ఆలయ నిర్మాణ పనులు నిర్వహిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు జనవరి 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుప తలపెట్టింది. ఈ విశిష్ట కార్యక్రమానికి దాదాపు 7 వేల మంది అతిథులను ఆహ్వానిస్తున్నారు. 

గౌతమ్ అదానీ, ముఖేశ్ అంబానీ, రతన్ టాటా వంటి వ్యాపార దిగ్గజాలు, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ వంటి అగ్రశ్రేణి నటులు, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి క్రీడా ప్రముఖులను, వివిధ రంగాల్లో పేరెన్నికగన్న వ్యక్తులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. తాజాగా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కూడా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానం పలికింది. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట క్రతువుకు రావాలని కోరింది. 

కాగా, ఈ కార్యక్రమ ఆహ్వానితుల జాబితాలో ప్రముఖ పాత్రికేయులు కూడా ఉన్నారు. ప్రజాసేవకులు, రిటైర్డ్ సైనికాధికారులు, న్యాయవాదులు, పద్మ అవార్డు గ్రహీతలను సైతం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు.

More Telugu News