Pawan Kalyan: విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్... కాసేపట్లో జనసేన బహిరంగ సభ

  • విశాఖలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో జనసేన సభ
  • హాజరు కానున్న పవన్ కల్యాణ్
  • జనసేన పార్టీలో చేరనున్న ప్రముఖ కాంట్రాక్టర్ వెంకట సతీశ్ కుమార్
Pawan Kalyan arrives Vizag to attend Janasena rally

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖ చేరుకున్నారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆయనకు జనసేన పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో జనసేన పార్టీ భారీ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. ప్రముఖ కాంట్రాక్టర్ సుందరపు వెంకట సతీశ్ కుమార్ ఈ సభలో పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ సభకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యుడు నాగబాబు, విశాఖ నగరం, ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన నేతలు కూడా హాజరవుతారు.

More Telugu News