తన కార్యాలయంలో వైఎస్ చిత్ర పటానికి పూజలు చేసిన భట్టి విక్రమార్క
- అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లు భట్టి విక్రమార్క
- భట్టికి డిప్యూటీ సీఎం పదవి
- వైఎస్ చిత్రపటానికి పూల మాల వేసిన భట్టి
నేడు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో మల్లు భట్టి విక్రమార్క తన కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.