పెళ్లిలో ఎంగిలి ప్లేట్లు అతిథులకు తాకాయని.. వెయిటర్‌ను కొట్టి చంపేశారు!
- ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘటన
- ఆలస్యంగా వెలుగులోకి
- ముగ్గురు నిందితుల అరెస్ట్
ఆగ్రహంతో ఊగిపోయిన రిషభ్ అతడి స్నేహితులు మనోజ్, అమిత్ కలిసి పంకజ్‌ను అక్కడే చితకబాదారు. తీవ్రంగా గాయపడిన పంకజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భయపడిన రిషభ్, అతడి స్నేహితులు పంకజ్ మృతదేహాన్ని సమీపంలోని అడవిలో దాచేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ తర్వాతి రోజు బాధితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా, పరారీలో ఉన్న నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.