Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం... 3 వేదికలు, మరో 2 గ్యాలరీల ఏర్పాటు

  • ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం
  • 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రత్యేక వేదిక
  • 150 సీట్లతో వీవీఐపీలకు మరో వేదిక
Revanth Reddy swearing in ceremony

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లకు కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మరోవైపు ఈ కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. స్టేడియంలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది. ప్రధాన వేదికకు ఎడమవైపున ఉన్న వేదికపై 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆసీనులవుతారు. కుడి వైపున ఉన్న వేదికపై 150 సీట్లను ఏర్పాటు చేశారు. ఈ వేదికను వీవీఐపీలకు కేటాయించారు. వేదిక కింద అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో మరో గ్యాలరీని, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీని ఏర్పాటు చేశారు. స్టేడియంలో 30 వేల మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. స్టేడియం బయట ఉన్నవారు వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 

More Telugu News