Revanth Reddy: రేవంత్ రెడ్డికి తిలకం దిద్దిన దీపేందర్ సింగ్ తల్లి

Revanth Reddy taking blessings from the mother of Deepender Singh Hooda Ji is the best visual we can see today
  • దీపేందర్ సింగ్‌ను ఆహ్వానించేందుకు ఆయన ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
  • రేవంత్ రెడ్డి తన ఇంటికి రావడంపై దీపేందర్ సింగ్ హుడా ట్వీట్
  • రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరుపుతుందని విశ్వసిస్తున్నట్లు వెల్లడి
సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా తల్లికి పాదాభివందనం చేసి, ఆశీర్వాదాలు తీసుకున్నారు.  రేపు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో పలువురు నేతలను కలుస్తున్నారు. ఇందులో భాగంగా దీపేందర్ సింగ్ హుడా నివాసానికి వెళ్లారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని కోరారు. ఈ సమయంలో హుడా తల్లి... రేవంత్ రెడ్డికి తిలకం దిద్ది ఆశీర్వదించారు.

ఇందుకు సంబంధించి దీపేంద్ర సింగ్ హుడా ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికైన తర్వాత తన ప్రియమిత్రుడు రేవంత్ రెడ్డి ఈ రోజు తన నివాసానికి చేరుకొని తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారని పేర్కొన్నారు. నిజమైన స్వేహితుడిగా తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చారని, సీఎం అవుతున్నప్పటికీ గతంలో కంటే ఆత్మీయత కనిపిస్తోందని పేర్కొన్నారు. రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరుపుతుందని బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
Revanth Reddy
Telangana Assembly Results

More Telugu News