Telangana: తెలంగాణలో మరో రెండు నెలల్లో సర్పంచ్ ఎన్నికలు

  • గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
  • జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపిన ఎన్నికల కమిషన్
  • 2024 జనవరి 31తో ముగియనున్న సర్పంచ్‌ల పదవీ కాలం
Sarpanch elections within two months

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. సర్పంచ్‌ల పదవీ కాలం 2024 జనవరి 31వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల వివరాల కోసం జిల్లాల వారీగా ఎన్నికల సంఘం నివేదికను కోరింది. సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలను గ్రామ కార్యదర్శులు ఎలక్షన్ కమిషన్‌కు పంపించారు. గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగియడంతో ఎన్నికల కసరత్తును ప్రారంభించారు. తెలంగాణలో 12 వేల గ్రామపంచాయతీలు, లక్షా పదమూడు వేలకు పైగా వార్డులు ఉన్నాయి.

More Telugu News