Revanth Reddy: హైదరాబాద్‌కు బయలుదేరిన సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి

  • రేవంత్ రెడ్డితో పాటు హైదరాబాద్‌కు మాణిక్ రావు ఠాక్రే
  • అంతకుముందు అధిష్ఠానం పిలుపుతో విమానాశ్రయం నుంచి వెనక్కి వెళ్లిన రేవంత్
  • గంటపాటు రేవంత్-ఠాక్రేల మధ్య చర్చ
Revanth Reddy coming Hyderabad

టీపీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆయనతో పాటు తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే కూడా భాగ్యనగరానికి వస్తున్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చారు. అయితే ఆయనకు అధిష్ఠానం నుంచి ఆహ్వానం రావడంతో హుటాహుటిన వెనక్కి వెళ్లారు. ఏఐసీసీ కార్యాలయంలోని మహారాష్ట్ర సదన్‌లో మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరువురు చర్చించారు. అనంతరం రేవంత్, ఠాక్రేలు హైదరాబాద్‌కు బయలుదేరారు. రేవంత్‌తో పాటు మంత్రులుగా ప్రమాణం చేసే అంశంపై వారిద్దరు చర్చించుకున్నారని సమాచారం. రేపు తెలంగాణ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.

More Telugu News