Balakrishna: బాలయ్య మూవీలో ముగ్గురు భామలు .. అసలు కథానాయిక ఆమెనే!

  • బాబీతో సెట్స్ పైకి వెళ్లిన బాలకృష్ణ
  • ఆయన జోడీకడుతున్న ఊర్వశి - మీనాక్షి 
  • ఊటీలో జరుగుతున్న షూటింగ్
  • త్వరలో జాయిన్ కానున్న మూడో హీరోయిన్

Balayya Movie Update

బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఎమోషన్స్ ప్రధానంగా సాగే మాస్ యాక్షన్ మూవీగా ఈ సినిమా నిర్మితమవుతోంది. సితార బ్యానర్లో ఇంతవరకూ వచ్చిన భారీ బడ్జెట్ సినిమాల్లో ఇది ఒకటి అని తెలుస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. 

కథ ప్రకారం ఈ సినిమాలో హీరో జర్నీ మూడు దశలలో కొనసాగుతుంది. అంటే మూడు కాలాలను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందన్న మాట. ఆయన జీవితంలోని ఒక్కో దశలో ఒక్కో హీరోయిన్ ఆయనకి తారసపడుతుంది. ఇప్పటికే ఊర్వశి రౌతేలా .. మీనాక్షి చౌదరిని ఎంపిక చేయడం జరిగిపోయింది. 

ప్రస్తుతం బాలయ్యతో పాటు ఈ ఇద్దరు బ్యూటీల కాంబినేషన్ లోని సీన్స్ ను 'ఊటి'లో చిత్రీకరిస్తున్నారు. ఇక మరో హీరోయిన్ కోసం వెతికే పనిలో టీమ్ ఉందని అంటున్నారు. ఇప్పుడు రానున్నదే మెయిన్ హీరోయిన్ అని చెబుతున్నారు. ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకోనున్నారని టాక్. ఆ ఛాన్స్ ను ఎవరు సొంతం చేసుకుంటారనేది చూడాలి మరి.

More Telugu News