Prabhas: మాస్ ఆడియన్స్ ను ఊరిస్తున్న సలార్ .. దేవర .. పుష్ప 2

  • బొగ్గు గనుల నేపథ్యంలో సాగే 'సలార్'
  • సముద్రం నేపథ్యంలో నడిచే 'దేవర'
  • అడవి చుట్టూ అల్లుకున్న కథతో 'పుష్ప2'
  • పాన్ ఇండియా స్థాయిలో పలకరించనున్న మాస్ యాక్షన్    

Upcoming Tollywood Mass Action Movies

మాస్ ఆడియన్స్ ను ఊరిస్తున్న పాన్ ఇండియా సినిమాల జాబితాలో ఇప్పుడు 'సలార్' .. 'దేవర' .. 'పుష్ప 2' సినిమాలు కనిపిస్తున్నాయి.  ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ సినిమా 'బొగ్గుగనుల' నేపథ్యంలో కొనసాగుతుంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీన అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. ఇక 'దేవర' విషయానికివస్తే ఈ కథ 'సముద్రం' నేపథ్యంలో సాగుతుంది. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ పరిచయమవుతోంది. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా, ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది. ఇక బన్నీ - సుకుమార్ కాంబినేషన్లోని 'పుష్ప 2' ఫారెస్టు నేపథ్యంలో ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. వచ్చే ఆగస్టు 15న రిలీజ్ కానుంది. 

ఈ మూడు సినిమాల కథా నేపథ్యం వేరైనప్పటికీ, ఎమోషన్స్ తో కూడిన మాస్ యాక్షన్ తో ముందుకు వెళ్లనున్నాయి. భారీ యాక్షన్ సీన్స్ తో మంత్ర' ముగ్ధులను చేయనున్నాయి. 'పుష్ప' మాదిరిగానే 'సలార్' .. 'దేవర' రెండో పార్టును కలిగి ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా ఐదు భాషల్లో విడుదలవుతుండటం మరో విశేషం.

More Telugu News