US Job Openings: అమెరికాలో దారుణంగా పడిపోయిన జాబ్ ఓపెనింగ్స్

  • అమెరికాలో రెండోసారి 90 లక్షల కంటే తక్కువకు పడిపోయిన ఉద్యోగావకాశాలు
  • అక్టోబర్ చివరి బిజినెస్ డే నాడు ఖాళీగా 8.73 మిలియన్ ఉద్యోగాలు
  • ప్రస్తుతం ప్రతి ఉద్యోగార్థికి 1.3కు పడిపోయిన జాబ్ ఓపెనింగ్స్
America Job Openings Drop To Lowest Level

అమెరికాలో ఉద్యోగావకాశాలు దారుణంగా పడిపోయాయి. మార్చి 2021 తర్వాత అక్టోబరులో అమెరికాలో ఉద్యోగావకాశాల సంఖ్య రెండోసారి 90 లక్షల కంటే తక్కువకు పడిపోయింది. యూఎస్ లేబర్ మార్కెట్ కూలింగ్‌ను ఇది సూచిస్తోంది. తాజా జాబ్ ఓపెనింగ్స్, లేబర్ టర్నోవర్ (జేవోఎల్‌టీఎస్) ప్రకారం.. అక్టోబర్ చివరి బిజినెస్ డే నాడు 8.73 మిలియన్ ఉద్యోగాలు ఖాళీలుగా మిగిలిపోయాయి. మార్చి 2021 తర్వాత ఈ సంఖ్య అత్యల్పం. గత నెలలో విడుదలైన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం అక్టోబరులో.. జనవరి 2021 నుంచి ఉద్యోగాలు కనిష్ఠ స్థాయికి మందగించడం ఇది రెండోసారి.


అదే సమయంలో అక్టోబరులో నిరుద్యోగ స్థాయి 6.51 మిలియన్‌కు చేరుకుంది. అంటే ప్రతి ఉద్యోగార్థికి ఇప్పుడు 1.3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మార్చి 2020లో మహమ్మారి విజృంభణకు ముందు, ఇప్పటికే కష్టతరమైన లేబర్ మార్కెట్‌లో ఒక నిరుద్యోగికి 1.2 ఉద్యోగావకాశాలు ఉన్నాయి. మార్చి 2022లో ప్రతి నిరుద్యోగికి 2.0 ఉద్యోగావకాశాలను పెంచడానికి ముందు, కొవిడ్ పరిమితుల ద్వారా ప్రభావితమైన రంగాల్లో భారీ తొలగింపులు చోటుచేసుకున్నాయి. దీంతో ఏప్రిల్ 2020 నాటికి ఆ సూచీ 0.2కి క్రాష్ అయింది. ఆగస్టు 2021లో 8.3 మిలియన్ల మంది నిరుద్యోగులకు 11 మిలియన్ ఉద్యోగాలుండగా, ప్రస్తుతం ఒక్కో ఉద్యోగార్థికి అత్యల్పంగా 1.3  జాబ్ ఓపెనింగ్స్ మాత్రమే ఉన్నాయి.

More Telugu News