Stalin: తక్షణ సాయం కోసం కేంద్రానికి లేఖ రాసిన స్టాలిన్

  • మిగ్జామ్ తుపాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు
  • రిలీఫ్ ఫండ్ కింద రూ. 5,060 కోట్లను ఇవ్వాలని ప్రధానిని కోరిన స్టాలిన్
  • నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని విన్నపం
Stalin writes letter to PM Modi seeking financial help for cyclone loss

మిగ్జామ్ తుపాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. చెన్నై మహానగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరద నీట మునిగాయి. తుపాను కారణంగా తమిళనాడుకు భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాశారు. రిలీఫ్ ఫండ్ కింద తక్షణమే రూ. 5,060 కోట్లను ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతూ ఆయన లేఖ రాశారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఈ లేఖను ప్రధాని మోదీకి డీఎంకే ఎంపీ టీఆర్ బాలు అందజేయనున్నారు. 

మరోవైపు తుపాను కారణంగా ఏపీలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. తెలంగాణలో సైతం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల నేపథ్యంలో, అన్ని రకాల సహాయక చర్యలను చేపట్టాలని ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

More Telugu News