నేడు సోనియాగాంధీని కలవనున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy to meet Sonia Gandhi today
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈరోజు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గేలతో ఆయన సమావేశం కానున్నారు. మంత్రివర్గ కూర్పుపై పార్టీ హైకమాండ్ తో చర్చించనున్నారు. మధ్యాహ్నం తర్వాత రేవంత్ హైదరాబాద్ కు తిరిగిరానున్నారు. మరోవైపు రేపు ఉదయం 10.28 గంటలకు ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేవంత్ తో పాటు 9 లేదా 18 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Sonia Gandhi
Rahul Gandhi
Priyanka Gandhi
Mallikarjun Kharge
Delhi
Oath

More Telugu News