Nithiin: 'ఎక్స్ ట్రా ఆర్టినరీ' ప్రమోషన్... నితిన్, సిద్ధు జొన్నలగడ్డ మధ్య ఆసక్తికర సంభాషణ... వీడియో ఇదిగో!

  • నితిన్ హీరోగా 'ఎక్స్ ట్రా... ఆర్డినరీ మేన్'
  • డిసెంబరు 8న విడుదల కానున్న చిత్రం
  • ప్రమోషన్స్ ముమ్మరం చేసిన చిత్రబృందం
  • వెరైటీగా సిద్ధు జొన్నలగడ్డతో నితిన్ బాతాఖానీ
Nithiin Extra Ordinary talk with Siddhu Jonnalagadda

టాలీవుడ్ హీరో నితిన్ తాజా చిత్రం 'ఎక్స్ ట్రా... ఆర్డినరీ మేన్'. ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, హీరో నితిన్ తన చిత్రం కోసం ఓ ఎక్స్ ట్రార్డినరీ ప్రమోషన్ నిర్వహించారు. 

ఓ రెస్టారెంట్ లో యువ హీరో సిద్ధు జొన్నలగడ్డతో బాతాఖానీ వేస్తూ తన సినిమా వివరాలను, సినిమాలో పాత్రల వివరాలను, తన క్యారెక్టర్ గురించిన సంగతులను పంచుకున్నారు. సిద్ధు అడిగే ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సంభాషణ ఆకట్టుకునేలా సాగింది. ఈ చిట్ చాట్ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ యూట్యూబ్ లో విడుదల చేసింది. 

వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఎక్స్ ట్రా... ఆర్డినరీ మేన్ చిత్రాన్ని నితిన్ కుటుంబ సభ్యులే నిర్మించారు. ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్. డాక్టర్ రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేశ్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, అన్నపూర్ణమ్మ, పవిత్ర నరేశ్ తదితరులు నటించారు. 

ఈ చిత్రానికి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించారు.

More Telugu News