Revanth Reddy: కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ జీవిత ప్రయాణం...!

  • ఎల్లుండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి
  • 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి
  • 2018లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్
Life Journey of CM Revanth Reddy

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఆయన ఎల్లుండి సాయంత్రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచింది. మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ సీఎం కావాలని అధిష్ఠానానికి సూచించారు. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం అభ్యర్థిపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాజకీయ జీవిత ప్రయాణం గురించి కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.

- 1969 - నవంబరు 8న నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్
- 2006 - మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం.
- 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక.
- 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు.
- 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్.
- 2014–17 మధ్య టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్.
- 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా
- 2017లో  కాంగ్రెస్‌ పార్టీలో చేరిక.
- 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.
- 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి.
- 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం.
- 2021 జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ నియామకం.
- 2021 జులై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం.
- 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు.

More Telugu News