Nara Lokesh: తుపాను నష్టం అపారంగా ఉంది... రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది: నారా లోకేశ్

Nara Lokesh says AP govt failed in Cyclone measures

  • కోస్తా జిల్లాలపై పంజా విసిరిన మిగ్జామ్ తుపాను
  • కేంద్రం హెచ్చరికలను ఏపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్న లోకేశ్
  • కనీసం సమీక్ష కూడా జరపలేదని ఆగ్రహం
  • తుపాను బాధితులను టీడీపీ శ్రేణులు ఆదుకోవాలని పిలుపు

ఏపీ కోస్తా జిల్లాల్లో మిగ్జామ్ తీవ్ర తుపాను విలయం సృష్టించిన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. తుపాను తీవ్రతపై కేంద్ర విపత్తు సంస్థలు గత వారం రోజుల నుంచే హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టిందని విమర్శించారు. తుపాను హెచ్చరికలపై రాష్ట్ర ప్రభుత్వం కనీస సమీక్ష జరపకపోవడం దారుణమని పేర్కొన్నారు. 

తుపాను పరిస్థితులపై అప్రమత్తం చేయడం నుంచి సహాయక చర్యలు చేపట్టడం వరకు అన్నింటా ప్రభుత్వం విఫలమైందని లోకేశ్ అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. 

ఎప్పుడు, ఏ విపత్తు వచ్చినా ఆదుకునేది టీడీపీయేనని, అధికారంలో ఉన్నా లేకున్నా టీడీపీ మానవతాదృక్పథంతో సాయం చేసేదని లోకేశ్ వివరించారు. రాష్ట్రంలో తుపాను నష్టం తీవ్రస్థాయిలో ఉందని, ఈ కష్టకాలంలో ప్రజలకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బాధితుల‌కు ఆహారం, ఇత‌ర‌త్రా సాయం అందించాలని సూచించారు.

  • Loading...

More Telugu News