Revanth Reddy: రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ

Nandamuri Balakrishna conveys his best wishes to newly elected CM for Telangana
  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం
  • సీఎంగా రేవంత్ రెడ్డిని ఖరారు చేసిన అధిష్ఠానం
  • తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించాలన్న బాలకృష్ణ
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో, రేవంత్ రెడ్డిపై అభినందనల జడివాన కురుస్తోంది. తాజాగా, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన ఎనుముల రేవంత్ రెడ్డి గారికి నా అభినందనలు అంటూ బాలకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. 

"తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ప్రజా సేవ పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి ఎదిగారు. తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నెరవేర్చాలని, అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రిగా మీ మార్కు పాలనతో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను" అంటూ బాలకృష్ణ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Revanth Reddy
Chief Minister
Balakrishna
Congress
TDP
Telangana
Andhra Pradesh

More Telugu News