Cyclone: బాపట్ల వద్ద అల్లకల్లోలంగా సముద్రం.. 20 అడుగులు ముందుకు వచ్చిన సముద్రం

  • బాపట్ల వద్ద కాసేపట్లో తీరం దాటనున్న తుపాను
  • పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు
  • చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతన్నల ఆవేదన
Cyclone to land fall near Bapatla

కాసేపట్లో మిగ్జామ్ తుపాను బాపట్ల వద్ద తీరాన్ని దాటనుంది. ఈ నేపథ్యంలో బాపట్ల వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. 20 అడుగుల ముందుకు సముద్రం చొచ్చుకొచ్చింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. పంటలు దెబ్బతింటున్నాయి. చేతి కొచ్చిన పంట నాశనం కావడంతో రైతన్నలు కంటతడి పెడుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


మరోవైపు తుపాను నేపథ్యంలో 11 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

More Telugu News