Nani: కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ను కలిసిన నాని

  • బెంగళూరులోని శివ రాజ్ కుమార్ నివాసానికి వెళ్లిన నాని
  • ఆయనతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన నేచురల్ స్టార్
  • ఈ నెల 7న విడుదలవుతున్న నాని చిత్రం 'హాయ్ నాన్న'
Nani meets Shiva Rajkumar

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ను నేచురల్ స్టార్ నాని కలిశారు. బెంగళూరులోని శివ రాజ్ కుమార్ నివాసానికి నాని వెళ్లారు. నానికి శివ రాజ్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి నాని బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఇద్దరు సినీ స్టార్లు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం నాని తన తాజా చిత్రం 'హాయ్ నాన్న' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 7వ తేదీన విడుదల కాబోతోంది. ఇందులో భాగంగానే శివ రాజ్ కుమార్ ను ఆయన కలిశారు. ఈ చిత్రంలో శృతి హాసన్, ప్రియదర్శి, జయరామ్, బేబీ కియారా ఖన్నా తదితరులు నటించారు. యువ దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించారు. 

More Telugu News