Mallu Bhatti Vikramarka: ముఖ్యమంత్రి ఎంపికకు ముందు మల్లు భట్టి విక్రమార్క కీలక ట్వీట్

  • తాను 1364 కిలో మీటర్లు, 109 రోజులు పాదయాత్ర చేశానని గుర్తు చేసిన మల్లు భట్టి
  • మండుటెండలు, దట్టమైన గుట్టలు, పొగలు కక్కే రోడ్లు, వేల అడ్డంకులు తన సంకల్పానికి అడ్డు రాలేదని వ్యాఖ్య
  • పాదయాత్ర చేసిన దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచిందన్న మల్లు భట్టి
Mallu Bhatti Vikramarka interesting tweet

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వరుస భేటీలు జరుపుతున్న కీలక సమయంలో మధిర నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన మల్లు భట్టి విక్రమార్క కీలక ట్వీట్ చేశారు. సీఎం పదవికి రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా మల్లు భట్టి ట్వీట్ ఆసక్తికరంగా మారింది. 

'ప్రతి పేదవాడి గుండె తాకిన క్షణాలు... 
గుండె నిండా ఆత్మ స్థైర్యం, కుంగిపోతున్న జీవితాలకు ఈ అరాచక పాలన నుండి విముక్తి ఇవ్వాలన్న లక్ష్యం, నైరాశ్యంలో ఉన్న క్షేత్రస్థాయి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలన్న ఆశ.. ఇవే నా పాదయాత్రకు ఆయువు పోసి నడిపించాయి. 
దట్టమైన గుట్టలు, పొగలు కక్కే రోడ్డులు, వేల అడ్డంకులు.. 
మండుటెండలు, వడగాళ్ల వానలు, ఎముకలు వణికించే చలి.. కాలేదు ఏవి మన సంకల్పానికి అడ్డు..' అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. తాను 1364 కిలో మీటర్లు, 109 రోజులు పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. తాను అడుగుపెట్టిన అన్ని నియోజకవర్గాల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించిందని పేర్కొన్నారు.

More Telugu News