Kalyanram: మరో డిఫరెంట్ కంటెంట్ తో రంగంలోకి కల్యాణ్ రామ్!

  • 'డెవిల్' పనులతో బిజీగా ఉన్న కల్యాణ్ రామ్ 
  • పవన్ సాధినేనితో సినిమాకి సన్నాహాలు
  • త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు 
  • ఆ తరువాత 'బింబిసార 2' పైనే దృష్టి

Kalyanram in Pavan Sadhineni Movie

కల్యాణ్ రామ్ తన తాజా చిత్రమైన 'డెవిల్' ను ఆడియన్స్ ముందుకు తీసుకుని రావడానికి రెడీ అవుతున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా మాళవిక నాయర్ అలరించనుంది. ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. డిఫరెంట్ కంటెంట్ కావడంతో అందరిలో ఆసక్తి ఉంది. 

ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ఆ తరువాత ప్రాజెక్టును కల్యాణ్ రామ్ లైన్లో పెట్టినట్టుగా చెబుతున్నారు. ఆయన తన తదుపరి సినిమాను పవన్ సాధినేని దర్శకత్వంలో చేయనున్నట్టుగా సమాచారం. 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న పవన్ సాధినేని, ఆ తరువాత వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నాడు.

మళ్లీ ఇప్పుడు కల్యాణ్ రామ్ సినిమా కోసం రంగంలోకి దిగాడు. కొంతకాలం క్రితమే కథ ఓకే అయినప్పటికీ ముహూర్తం ఇప్పుడు కుదిరిందని టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు మొదలు కానున్నాయని అంటున్నారు. ఈ సినిమా తరువాత 'బింబిసార 2' ప్రాజెక్టును చేయడానికి కల్యాణ్ రామ్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడని చెబుతున్నారు. 

More Telugu News