KCR: ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్న కేసీఆర్

  • 2004 నుంచి తుగ్లక్ రోడ్ లో కేసీఆర్ కు అధికారిక నివాసం
  • సీఎంలకు ఢిల్లీలో అధికారిక నివాసాలను కేటాయిస్తున్న కేంద్రం
  • ఇప్పుడు మాజీ సీఎం కావడంతో అధికార నివాసాన్ని ఖాళీ చేస్తున్న కేసీఆర్
KCR to vacate his official residence in Delhi

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ లో ఉన్న అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. 2004లో టీఆర్ఎస్ తరపున కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందిన కేసీఆర్... మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి హోదాలో ఆయనకు తుగ్లక్ రోడ్ లో టైప్ 8 క్వార్టర్ ను కేటాయించారు. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత నిర్వహించిన ఉపఎన్నికలో మళ్లీ ఎంపీగా గెలుపొంది అదే నివాసంలో కొనసాగారు. 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికై అదే నివాసంలోనే ఉన్నారు. 2014లో సీఎం అయిన తర్వాత అదే క్వార్టలోనే కొనసాగారు.

రాష్ట్ర ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అధికారిక నివాసాలను కేటాయిస్తుంది. ఈ క్రమంలో సీఎంగా ఉన్న కేసీఆర్ కు కేంద్రం అదే నివాసాన్ని కేటాయించింది. ఆ తర్వాత ఎంపీగా గెలుపొందిన కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఆ నివాసంలోనే ఉన్నారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడంతో సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అధికార నివాసాన్ని కేసీఆర్ ఖాళీ చేయబోతున్నారు.

More Telugu News