Cyclone: దక్షిణ కోస్తా తీరానికి చేరువలో మిగ్జామ్ తుపాను

  • మరికాసేపట్లో తీరాన్ని తాకే అవకాశం
  • ఉత్తర దిశగా కదులుతున్న మిగ్జామ్ తుపాను
  • కావలికి 40 కి.మీ. దూరంలో ఉందన్న అధికారులు
  • వాతావరణశాఖ తాజా బులెటిన్
Cyclone Michaung IMD Latest Bulletin

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మిగ్జామ్ దక్షిణ కోస్తా తీరానికి చేరువైంది. మరికాసేపట్లో తుపాను బాపట్ల తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా బులెటిన్ లో పేర్కొంది. తుపాను తీరాన్ని సమీపిస్తుండడంతో దక్షిణ కోస్తా ఏరియాలో పెను గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు 2 మీటర్ల మేర ఎగిసిపడుతున్నాయి. తుపాను బాపట్ల తీరానికి వాయవ్యంగా 80 కి.మీ. దూరంలో, కావలికి 40 కి.మీ. దూరంలో ఉందని అధికారులు చెప్పారు.

గంటకు 12 కి.మీ. వేగంతో తీరం వైపుకు దూసుకొస్తోందని వివరించారు. గంటకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో బాపట్ల వద్ద మిగ్జామ్ తుపాను తీరాన్ని దాటనుంది. తుపాను తీరాన్ని చేరువవుతున్న క్రమంలో దట్టమైన మేఘాలు సగభాగం భూ ఉపరితలం మీదకు వచ్చేశాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటిన తర్వాత వర్ష తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు.

More Telugu News