Nani: 'బలగం' వేణు డైరెక్షన్ లో చేయాలనుంది: హీరో నాని

  • డిఫరెంట్ కంటెంట్ తో 'హాయ్ నాన్న'
  • ఈ నెల 7వ తేదీన సినిమా విడుదల 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాని
  • దర్శకుడిగా పరిచయమవుతున్న శౌర్యువ్
Nani Interview

నాని హీరోగా ఈ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'హాయ్ నాన్న' సినిమా సిద్ధమవుతోంది.  దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను జనంలోకి తీసుకుని వెళ్లడానికి తనవంతు కృషి చేస్తున్నాడు. అందులో భాగంగానే కొంతసేపటి క్రితం నాని ట్విట్టర్ ద్వారా 'ఆస్క్ నాని' పేరుతో చాట్ సెషన్ నిర్వహించారు.

ఈ చాట్ సెషన్ లో ఆయన అభిమానులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలిస్తూ వెళ్లాడు. కొత్తగా వచ్చిన దర్శకులలో ఎవరితో సినిమా చేయడానికి మీరు ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు? అంటూ ఒక అభిమాని అడిగాడు. అందుకు నాని స్పందిస్తూ, 'బలగం' వేణు పేరు చెప్పాడు. ఆ సమాధానం పట్ల మిగతా అభిమానులు కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. 

కథ బాగుండాలే గానీ కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో నాని ఎంత మాత్రం ఆలోచన చేయడు. అవకాశం కుదిరినప్పుడల్లా ఆయన కొత్త దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే వెళుతున్నాడు. 'హాయ్ నాన్న' దర్శకుడు శౌర్యువ్ కి కూడా ఇదే ఫస్టు మూవీ. తాజాగా నాని చెప్పిన ఈ మాట వింటుంటే, ఇక 'బలగం' వేణుదే ఆలస్యం అనిపిస్తోంది. 

More Telugu News