chandrababu: ఎల్లుండి ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు

Chandrababu going to Delhi
  • సీఈసీని కలవనున్న చంద్రబాబు
  • ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్న టీడీపీ అధినేత
  • ఈ నెల 10న ఏపీకి వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేయనున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన సీఈసీకి చెందిన బృందం ఏపీకి రానుంది. ఈ నేపథ్యంలో వారు రాష్ట్రానికి రాకముందే సీఈసీని కలిసి ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబుతో పాటు పార్టీ కీలక నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. వీరందరితో కలిసి చంద్రబాబు సీఈసీని కలవనున్నారు.
chandrababu
Telugudesam
Delhi

More Telugu News