Gautham Krishna: శివాజీ మాటపై నిలబడే మనిషి కాదు: గౌతమ్ కృష్ణ

  • క్రితం వారం ఎలిమినేట్ అయిన గౌతమ్ కృష్ణ
  • తాను సోలోగా ఆడుతూ వచ్చానని వెల్లడి 
  • నాగ్ సార్ కి శివాజీ విషయం సరిగ్గా చెప్పలేకపోయానని వ్యాఖ్య
  • ఆట వేరు - ఫ్రెండ్షిప్ వేరు అని వివరణ

Gautham Krishana Interview

బిగ్ బాస్ హౌస్ లో ఉండగా శివాజీ - గౌతమ్ కృష్ణ మధ్య నామినేషన్స్ సమయంలో వాదనలు జరుగుతూ వచ్చాయి. ప్రశాంత్ .. యావర్ లను శివాజీ సపోర్టు చేయడం, తన పట్ల వేరుగా వ్యవహరించడం గురించి గౌతమ్ కృష్ణ తరచూ ప్రశ్నించేవాడు. ఉద్దేశ పూర్వకంగా తనని అతను టార్గెట్ చేస్తున్నాడని శివాజీ అసహనాన్ని ప్రదర్శించేవాడు. 

క్రితంవారం ఎలిమినేట్ అయిన గౌతమ్ కృష్ణ, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " వీకెండ్ ఎపిసోడ్ లో శివాజీ గారి గురించి నేను నాగార్జున గారి దగ్గర ప్రస్తావించాను. అయితే నేను శివాజీ గారి గురించి ఏదైతే చెప్పాలనుకున్నానో అది స్పష్టంగా చెప్పలేకపోయాననే విషయం ఆ తరువాత నాకు అర్థమైంది. అతను మాటపై నిలబడే మనిషైతే కాదు" అని అన్నాడు.

" అమర్ కి .. నాకు మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. ఒక ఫ్రెండ్ గా నేరుగా చెప్పకుండా, నామినేషన్స్ లో ప్రస్తావించడం ఏంటని అడుగుతున్నారు. మొదటి నుంచి కూడా నేను సోలోగా ఆడుతూ వచ్చాను. నా ఫ్రెండ్స్ కదా నామినేట్ చేయకూడదని నేను అనుకోలేదు. అందువలన నామినేట్ చేస్తూ వెళ్లాను .. అది ఆటలో భాగం అంతే" అని చెప్పాడు. 

More Telugu News