పోలీసులపై కాల్పులు జరిపితే ఇల్లు ధ్వంసం.. అమెరికాలో ఘటన.. వీడియో ఇదిగో!
- సెర్చ్ వారెంట్ తో తనిఖీ కోసం వచ్చిన పోలీసులు
- బెదిరించేందుకు ఫ్లేర్ గన్ తో కాల్పులు జరిపిన అనుమానితుడు
- పెలుడుకి ధ్వంసమైన ఇల్లు.. భారీగా ఎగసిపడ్డ మంటలు
అర్లింగ్టన్ పోలీసుల కథనం ప్రకారం.. బ్లూమాంట్ ఏరియాలోని ఓ ఇంటిని తనిఖీ చేసేందుకు సెర్చ్ వారెంట్ తో అధికారులు వెళ్లారు. పోలీసులను చూసి అనుమానితుడు ఫ్లేర్ గన్ తో కాల్పులు జరిపాడు. ఇంట్లో పలు రౌండ్లు కాల్పులు జరపడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు ఘటన నేపథ్యంలో చుట్టుపక్కల ఇళ్లల్లోని ప్రజలను అక్కడి నుంచి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అనుమానితుడి పరిస్థితి ఏంటనే విషయంపై స్పష్టత లేదని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని వివరించారు.