Congress: మరికాసేపట్లో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ సమావేశం... తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక

AICC to decide CM today
  • కొనసాగుతున్న సీఎల్పీ నాయకుడి ఎంపిక ప్రక్రియ  
  • ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి అధిష్ఠానానికి పంపించిన డీకే శివకుమార్ 
  • ఎల్లా హోటల్ నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేతలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లను గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక క్లిష్టంగా మారింది. ఉదయం హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సేకరించారు. ఎమ్మెల్యేల అభిప్రాయలకు సంబంధించిన వివరాలను ఏఐసీసీ అగ్రనాయకులు సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నట్లు అంతకుముందు డీకే శివకుమార్ ప్రకటించారు.

ఈ జాబితాను ఢిల్లీకి పంపించిన నేపథ్యంలో అధిష్ఠానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. సీఎల్పీ నేతను నిర్ణయించడానికి మరికాసేపట్లో అంటే సాయంత్రం ఐదున్నర గంటలకు కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని పైనల్ చేయనున్నారు. మరోవైపు, హోటల్ ఎల్లా నుంచి ఆ పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయారు.
Congress
Telangana Assembly Results
Sonia Gandhi
Mallikarjun Kharge

More Telugu News