Allu Aravind: త్వరలోనే సినీ పరిశ్రమ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తాం: అల్లు అరవింద్

Allu Aravind welcomes Congress govt in Telangana
  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం
  • నేడో, రేపో ప్రభుత్వం ఏర్పాటు
  • కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామన్న అల్లు అరవింద్
  • సినీ పరిశ్రమను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వాలకు కొత్త కాదని వెల్లడి 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధారణ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. నేడు గానీ, రేపు గానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. దీనిపై టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషదాయకమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని, త్వరలోనే చిత్ర పరిశ్రమ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని చెప్పారు. సినీ పరిశ్రమను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వాలకు కొత్త కాదని పేర్కొన్నారు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమను ఎంతో ప్రోత్సహించాయని, ఈ ప్రభుత్వం కూడా అదే రీతిలో ప్రోత్సాహం అందిస్తుందని భావిస్తున్నామని అల్లు అరవింద్ వివరించారు.

  • Loading...

More Telugu News