DK Shivakumar: ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యత మల్లికార్జున ఖర్గేకు అప్పగింత: డీకే శివకుమార్

  • గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో సీఎల్పీ సమావేశం
  • సీఎల్పీని ఎంపిక చేసే బాధ్యతను అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం చేసినట్లు వెల్లడి
  • కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ తీర్మానం
DK Shiva Kumar about chief minister post

ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించామని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎల్పీని ఎంపిక చేసే బాధ్యతను అధిష్ఠానానికి అప్పగిస్తూ పార్టీ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వారు తీర్మానం చేశారు.

అనంతరం డీకే శివకుమార్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశామన్నారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఖర్గేకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు చెప్పారని తెలిపారు. ఈ మేరకు తీర్మానం చేశామన్నారు. ఖర్గే నిర్ణయానికి కట్టుబడతామని ఎమ్మెల్యేలు చెప్పారన్నారు. కాగా, సీఎల్పీ సమావేశం దాదాపు గంటపాటు జరిగింది. ఈ సమావేశంలో డీకే శివకుమార్, దేవదాస్ మున్షీ, జార్జ్, అజయ్, మురళీధరన్ హాజరయ్యారు.

More Telugu News