DK Shivakumar: డీకే శివకుమార్ తో ముగిసిన కాంగ్రెస్ సీనియర్ల భేటీ.. ప్రారంభమైన సీఎల్పీ సమావేశం

TS Congress senior leaders meeting with DK Shivakumar ended
  • సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ
  • ముఖ్యమంత్రి రేసులో పలువురు కీలక నేతలు
  • సీఎల్పీ సమావేశంలో సీఎం అభ్యర్థి ఎంపిక
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధం అవుతోంది. 64 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ కు ఒక సీపీఐ ఎమ్మెల్యే మద్దతు ఉంది. మొత్తం 65 ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. మరోవైపు సీఎం ఎవరు కాబోతున్నారనే అంశం ఉత్కంఠను రేపుతోంది. సీఎం అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవడానికి హైదరాబాద్ లోని హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశం జరగబోతోంది. 

ఈ నేపథ్యంలో పార్క్ హయత్ హోటల్ లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో కాంగ్రెస్ సీనియర్లు మల్లు భట్టివిక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు భేటీ అయ్యారు. కాసేపటి క్రితం వీరి సమావేశం ముగిసింది. అనంతరం హోటల్ ఎల్లాకు బయల్దేరారు. ఎల్లా హోటల్ లో సీఎల్పీ సమావేశం ప్రారంభమయింది. సీఎల్పీ సమావేశంలో సీఎం అభ్యర్థి కోసం ఏకవాక్య తీర్మానం చేయబోతున్నారు. మరోవైపు, సీఎం పదవి విషయంలో రేవంత్ రెడ్డికి హైకమాండ్ మాట ఇచ్చిందనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.
DK Shivakumar
Congress
Telangana
Mallu Bhatti Vikramarka
Uttam Kumar Reddy
Komatireddy Raj Gopal Reddy

More Telugu News