Avika Gor: 'వధువు' సిరీస్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్!

Vadhuvu Web Series Update
  • బెంగాలీ లో సక్సెస్ అయిన 'ఇందు' సిరీస్ 
  • ఆ సిరీస్ కి తెలుగు రీమేక్ గా రూపొందిన 'వధువు'
  • టైటిల్ రోల్ ను పోషించిన అవికా గోర్ 
  • ఈ నెల 8 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

అవికా గోర్ కి అటు నార్త్ లోను .. ఇటు సౌత్ లోను మంచి క్రేజ్ ఉంది. చైల్డ్ ఆర్టిస్టుగా ఆమె చేసిన 'బాలికా వధూ' సీరియల్ ను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ తరువాత టీనేజ్ హీరోయిన్ గా తెలుగులోను ఆమె వరుస హిట్లు అందుకుంది. ఇప్పుడు కూడా తనకి నచ్చిన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. 

ఒక వైపున సినిమాలు చేస్తూనే, మరో వైపున ఆమె వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. ఇటీవలే వచ్చిన 'మాన్షన్ 24' సిరీస్ లోను ఆమె ముఖ్యమైన పాత్రను పోషించింది. ఆమె తాజా వెబ్ సిరీస్ గా రూపొందిన 'వధువు'.. 'హాట్ స్టార్' ద్వారా ఈ నెల 8వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. బెంగాలీ సిరీస్ 'ఇందు'కి ఇది రీమేక్. అక్కడ సక్సెస్ అయిన సిరీస్ ను తెలుగులో రీమేక్ చేశారు. 

శ్రీకాంత్ మెహతా - మహేంద్ర సోని నిర్మించిన ఈ సిరీస్ కీ, పోలూరు కృష్ణ దర్శకత్వం వహించాడు. అలీ రెజా .. నందూ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. శ్రీమంతుల ఇళ్లలో ఎలాంటి రహస్యాలు దాగుంటాయి? వాటిని బయటికి రానీయకుండా వాళ్లు ఏం చేస్తుంటారు? ఒకవేళ బయటకొస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? అనే కథాంశంతో ఈ సిరీస్ సాగనుంది.

  • Loading...

More Telugu News