Plane Crash: మెదక్ జిల్లాలో కుప్పకూలిన శిక్షణ విమానం.. పూర్తిగా కాలిపోయిన విమానం

Trainee plane crash in Hyderabad
  • మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలో విమానం క్రాష్
  • దుండిగల్ విమానాశ్రయంకు చెందిన ట్రైనింగ్ విమానం కావచ్చని ప్రాథమిక అంచనా
  • పైలట్లు ఏమయ్యారనే విషయంలో ఇంకా రాని క్లారిటీ  
హైదరాబాద్ శివార్లలో ఒక శిక్షణ విమానం కూలిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలో ఈ విమానం ఈ ఉదయం కూలిపోయింది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అక్కడకు వెళ్లి చూడగా మంటల్లో దగ్ధమవుతున్న విమానం కనిపించింది. వెంటనే వారు విమానం కుప్పకూలిన సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఈ ఘటనలో విమానం పూర్తిగా దగ్ధమయింది. హైదరాబాద్ దుండిగల్ విమానాశ్రయానికి చెందిన ట్రైనింగ్ విమానంగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే, విమానంలోని పైలట్లు ఏమయ్యారనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. వారు విమానం నుంచి క్షేమంగా ఎగ్జిట్ అయ్యారా? లేక విమానంలోనే సజీవదహనం అయ్యారా? అనేది తెలియాల్సి ఉంది.
Plane Crash
Hyderabad
Tainee Plane

More Telugu News