BJP: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల ఎన్నికల్లో విరిసిన 'కమలం'

  • మధ్యప్రదేశ్ లో అధికారం నిలబెట్టుకున్న బీజేపీ 
  • చత్తీస్ గఢ్, రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలను గద్దె దించిన కమలం
  • మధ్యప్రదేశ్ లో బీజేపీ 163 స్థానాలు
BJP grabs three states

తెలంగాణలో తప్పించి ఇవాళ కౌంటింగ్ జరిగిన మిగతా మూడు రాష్ట్రాల్లో కమలం వికసించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే గెలిచింది.  ఇందులో మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగా... చత్తీస్ గఢ్, రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్ ను మట్టికరిపించింది. 

మధ్యప్రదేశ్ లో మొత్తం సీట్లు 230. బీజేపీ 163 స్థానాలు సాధించి ఘనవిజయం సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇతరులకు ఒక స్థానం లభించింది. 

రాజస్థాన్ లో మొత్తం సీట్లు 200 కాగా, ఒక అభ్యర్థి మరణంతో 199 సీట్లకే ఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీ 115 సీట్లు గెలచుకోగా... అధికార కాంగ్రెస్ కు 70 స్థానాలే దక్కాయి. ఇతరులు 14 సీట్లు కైవసం చేసుకున్నారు. 

చత్తీస్ గఢ్ లో మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరగ్గా... బీజేపీ 54, కాంగ్రెస్ 35 సీట్లు సాధించాయి. ఇతరులకు ఒక స్థానం లభించింది. కాగా, తెలంగాణలో బీజేపీకి కేవలం 8 స్థానాలే లభించడం తెలిసిందే.

More Telugu News