Telangana Assembly Results: కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గెలుపు... కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరినీ ఓడించాడు!

BJP Katipalli Venkataramana Reddy wins from Kamareddy
  • 4,273 ఓట్ల మెజార్టీతో కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై కాటిపల్లి గెలుపు
  • మొదటి పదమూడు రౌండ్లలో ముందంజలో రేవంత్ రెడ్డి
  • ఆ తర్వాత ముందుకు వచ్చిన కాటిపల్లి
  • రెండో స్థానంలో కేసీఆర్, మూడోస్థానంలో రేవంత్ రెడ్డి
కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఘన విజయం సాధించారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటమి చవిచూశారు. మొదటి 13 రౌండ్లు రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. 14వ రౌండు నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ముందుకు వచ్చారు. అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్‌పై 4,273 ఓట్ల మెజార్టీతో గెలిచారు. చివరి రౌండ్లలో రేవంత్ రెడ్డి మూడోస్థానానికి పడిపోయారు.
Telangana Assembly Results
Revanth Reddy
KCR
katipalli venkataramana reddy

More Telugu News