Congress: రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేసింది: ఠాక్రే

manik rao thakre talks about congess winning
  • పార్టీ గెలవడంలో కార్యకర్తల పాత్ర ఎంతో ఉందని వ్యాఖ్య
  • కాంగ్రెస్ పార్టీకి మంచి విజయం అందించారన్న ఠాక్రే
  • కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని వ్యాఖ్య

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం చేసిందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. పార్టీ గెలవడంలో కార్యకర్తల పాత్ర ఎంతో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా సాగుతున్న నేపథ్యంలో ఠాక్రే మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి విజయం అందించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ప్రచారం కలిసి వచ్చిందన్నారు.

  • Loading...

More Telugu News