kaleru venkatesh: 85 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద

Kaleru Venkatesh from Ambarpet Lasya Nanditha from Contonment won
  • కుత్బుల్లాపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద గెలుపు
  • బాన్సువాడలో పోచారం, భద్రాచలంలో తెల్లం వెంకట్రావు విజయం
  • బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 31, బీజేపీ 5 సీట్లలో గెలుపు!
హైదరాబాద్‌లోని అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ విజయం సాధించారు. కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత గెలుపొందారు. కుత్బుల్లాపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద 85 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బాన్సువాడలో స్పీకర్, బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు.

మధ్యాహ్నం గం.2.45 సమయానికి బీఆర్ఎస్ 11 సీట్లలో గెలిచి 29 సీట్లలో ఆధిక్యంలో ఉండగా... కాంగ్రెస్ 31 సీట్లు గెలిచి మరో 32 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 5 సీట్లలో గెలిచి 3 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
kaleru venkatesh
lasya nanditha
BRS
Telangana Assembly Results

More Telugu News