Hyderabad: హైదరాబాద్ లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే...!

  • కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
  • హైదరాబాద్ లో బీఆర్ఎస్ హవా
  • రెండు చోట్ల బీజేపీ లీడింగ్
Hyderabad counting trend

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పలు చోట్ల 3 రౌండ్ల కౌంటింగ్ పూర్తవగా, కొన్ని చోట్ల రెండు రౌండ్లు ముగిశాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 15 చోట్ల ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. తొలి రౌండ్ అనంతరం ఎల్బీ నగర్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, అంబర్ పేట్, సనత్ నగర్ లో అధికార బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మలక్ పేట్ లో ఎంఐఎం ఆధిక్యం పొందగా... చార్మినార్, గోషామహల్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 

ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ తొలి రౌండ్ అనంతరం 471 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు లీడింగ్ లో కొనసాగుతున్నారు. పద్మారావుకు 6,212 ఓట్లు లభించగా, కాంగ్రెస్ అభ్యర్థి ఆదం సంతోష్ కు 2,281 ఓట్లు, బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణికి 943 ఓట్లు వచ్చాయి. గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ 2 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు.

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజారుద్దీన్ (భారత క్రికెట్ మాజీ సారథి) వెనుకంజలో ఉన్నారు. మూడో రౌండ్ అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ లీడింగ్ లో కొనసాగుతున్నారు.

More Telugu News