Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో బీజేపీ జోరు

  • మధ్యప్రదేశ్ లో 138 స్థానాల్లో కాషాయ పార్టీ లీడ్
  • 89 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ
  • రాజస్థాన్ లో 107 చోట్ల బీజేపీ అభ్యర్థుల హవా
BJP Continues To Lead In Rajasthan Assembly Election Counting

మధ్యప్రదేశ్ లో అధికార బీజేపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలోని 138 నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులే లీడ్ లో ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థులు 89 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే, ఫలితాల్లో మాత్రం ఇప్పటి వరకు బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళుతోంది. 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 116 సీట్లను గెలుచుకోవాలి.

ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో తొలిరౌండ్ లో బీజేపీ 138 చోట్ల లీడ్ లో ఉంది.  ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ బీజేపీ అభ్యర్థులు దూసుకెళుతున్నారు. తొలి రౌండ్ లో బీజేపీ అభ్యర్థులు 107 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 80 చోట్ల ముందంజలో ఉన్నారు. మరో 13 చోట్ల ఇతరులు లీడ్ లో ఉన్నారు.

More Telugu News