Telangana Assembly Election: కౌంటింగ్ కేంద్రాలకు పోస్టల్ బ్యాలెట్లు.. కౌంటింగ్ ప్రారంభం

  • 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
  • పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యాక ఈవీఎంల లెక్కింపు
  • 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు
  • కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు
Vote counting started in 4 states

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నెల రోజులపాటు అణచిపెట్టుకున్న ఉత్కంఠ కొద్దికొద్దిగా వీడిపోనుంది. తెలంగాణలో 49 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. అభ్యర్థులు కూడా లెక్కింపు కేంద్రాలకు చేరుకుంటున్నారు. 8.30 గంటల నుంచి ఈవీఎంలను లెక్కిస్తారు.

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన వెంటనే ఈవీఎంలను భద్ర పరిచిన స్ట్రాంగ్ రూమును తెరిచి కంట్రోల్ యూనిట్లకు టేబుల్‌కు ఒకటి చొప్పున బయటకు తీసుకొస్తారు. కంట్రోల్ యూనిట్‌లోని ‘టోటల్’ బటన్ నొక్కగానే ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుస్తుంది. అనంతరం ‘రిజల్ట్’ బటన్‌పై ఒత్తగానే ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో కనిపిస్తుంది. లెక్కింపు నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది.

More Telugu News