Virat Kohli: ఈ ఇటలీ మహిళా ఫుట్ బాలర్ ఫేవరెట్ క్రికెటర్ కోహ్లీ అంట!

Italian women soccer player Agata Centasso says her favourite Indian cricketer is Virat Kohli
  • కోహ్లీ ఫ్యాన్ లిస్టులో విదేశీ పుట్ బాల్ క్రీడాకారిణి
  • కోహ్లీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ పోస్టు పెట్టిన అగాటా సెంటాస్సో
  • భారత్ లోని ఫ్రెండ్స్ ద్వారా క్రికెట్ పై ఆసక్తి ఏర్పడిందని వెల్లడి
టీమిండియా డైనమిక్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు ప్రతిష్ఠలు ఖండాంతరాలు దాటుతున్నాయి. తాజాగా, ఇటలీ ఫుట్ బాల్ క్రీడాకారిణి అగాటా ఇసబెల్లా సెంటాస్సో తన అభిమాన క్రికెటర్ ఎవరంటే విరాట్ కోహ్లీ పేరే చెప్పింది. ఓ నెటిజన్ సోషల్ మీడియాలో మీ ఫేవరెట్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అని సెంటాస్సోను ప్రశ్నించగా... ఆమె కోహ్లీ ఫొటోను పోస్టు చేసి GOAT-గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే అర్థం వచ్చేలా మేక ఎమోజీని అటాచ్ చేసింది. 

సెంటాస్సో... ఇటలీలోని సిరీ-బి ఫుట్ బాల్ లీగ్ లో ఆడుతుంటుంది. తనకు క్రికెట్ అంటే ఎలా ఆసక్తి ఏర్పడిందో కూడా వివరించింది. భారత్ లో తనకు ఫ్రెండ్స్ ఉన్నారని, వారి ద్వారా క్రికెట్ పై ఇష్టం కలిగిందని వెల్లడించింది. గత ఏడాది కాలంగా క్రికెట్ ను ఫాలో అవుతున్నానని సెంటాస్సో తెలిపింది.
Virat Kohli
Agata Isabella Centasso
Cricketer
India
Foot Ball
Italy

More Telugu News